
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్
భారత్‌లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమంలో వేలాది టెక్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం వర్చువల్‌గా ప్రసంగించారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.