
Bharat Bandh on Agnipath : పోలీస్ వలయంలో విజయవాడ రైల్వేస్టేషన్, భారీ బందోబస్తు
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో బంద్ ప్రభావం అంతగా లేకున్నా రైల్వే స్టేషన్ పరిసరాలు మాత్రం పోలీస్ బలగాలతో నిండిపోయాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చెలరేగిన విధ్వంసం నేపథ్యంలో విజయవాడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ భద్రత ఏర్పాటుచేసారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటుచేసారు. స్టేషన్ కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.