Asianet News TeluguAsianet News Telugu

టిటిడి ఛైర్మన్ కు పుష్ఫ సినిమా చూపించాల్సిందే..: బండి సంజయ్ సెటైర్లు

హైదరాబాద్ : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ఆలయానికి అన్యమతాన్ని పాటించే భూమన కరుణాకర్ రెడ్డికి ఛైర్మన్ చేయడం దారుణమని బిజెపి నాయకులు బండి సంజయ్ అన్నారు.

హైదరాబాద్ : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ఆలయానికి అన్యమతాన్ని పాటించే భూమన కరుణాకర్ రెడ్డికి ఛైర్మన్ చేయడం దారుణమని బిజెపి నాయకులు బండి సంజయ్ అన్నారు.భూమన కూతురు పెళ్లి ఏ మతాచారం ప్రకారం జరిగింది? తన ఎన్నికల అపిడవిట్ లో ఆయన ఏ మతాన్ని ప్రస్తావించారు? అని ప్రశ్నించారు. తిరుమల ఆలయంపై కక్షగట్టిన వైసిపి ప్రభుత్వం హిందూ ధర్మ వ్యతిరేకిని టిటిడి ఛైర్మన్ గా నియమించిందని అన్నారు. తిరుమల కొండపై అడవుల గురించి తెలియాలంటే టిడిపి ఛైర్మన్ కు పుష్ఫ సినిమా చూపించాలంటూ బండి సంజయ్ ఎద్దేవా చేసారు. 

Video Top Stories