Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ప్రజాప్రతినిధుల ఇళ్లపై ప్రత్యర్థుల దాడి... మైలవరంలో అర్ధరాత్రి అలజడి

మైలవరం : ఎన్టీఆర్ జిల్లా  జి కొండూరు మండలం గంగినేని గ్రామంలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Jan 22, 2023, 10:41 AM IST | Last Updated Jan 22, 2023, 10:41 AM IST

మైలవరం : ఎన్టీఆర్ జిల్లా  జి కొండూరు మండలం గంగినేని గ్రామంలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇళ్లపై ప్రత్యర్థులు దాడులకు తెగబడ్డారు. పాతకక్షల నేపథ్యంలో వైసిపి సర్పంచ్ పిల్లి రామారావు, ఎంపిటిసి ప్రసాద్ ఇళ్లపైకి కర్రలతో దూసుకొచ్చిన ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో వైసిపి ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు కొందరు గాయపడగా ఇంటిముందున్న వాహనాలు ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైసిపి వర్గీయులు ఆరోపిస్తున్నారు.