ఛైర్మన్ గానే తిరిగి సింహాచలానికి... అప్పన్నను దర్శించుకున్న అశోకగజపతిరాజు

విశాఖపట్నం: సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని మాజీ కేంద్ర మంత్రి, ఆలయ ఛైర్మన్ అశోక గజపతి రాజు సతీ సమేతంగా దర్శించుకున్నారు. 

First Published Jun 16, 2021, 12:28 PM IST | Last Updated Jun 16, 2021, 12:28 PM IST

విశాఖపట్నం: సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని మాజీ కేంద్ర మంత్రి, ఆలయ ఛైర్మన్ అశోక గజపతి రాజు సతీ సమేతంగా దర్శించుకున్నారు. గతేడాది ఆలయ ఛైర్మన్ పదవినుండి తొలగించినప్పటి నుండి తాజాగా హైకోర్టు తిరిగి ఆయననే ఛైర్మన్ గా కొనసాగించాలని తీర్పు వచ్చేవరకు ఆయన ఆలయానికి రాలేదు. హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఆలయ ఛైర్మన్ గా నియమితులైన అశోకగజపతిరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 15 నెలల తరువాత ఆయన అప్పన్న ను దర్శించుకున్నారు. అనంతరం గోశాలను కూడా సందర్శించారు.