గన్నవరంలో టీచర్స్ సంకల్ప సభ... ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు, ఉద్రిక్తత
గన్నవరం : తమ సమస్యల పరిష్కారం, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఆందోళనకు దిగారు.
గన్నవరం : తమ సమస్యల పరిష్కారం, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గన్నవరంలో టీచర్స్ తలపెట్టిన సంకల్ప సభలో పాల్గొనేందుకు కాకినాడ నుండి వస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైనే దాదాపు 130 టీచర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, టీచర్లకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంకల్ప సభకు వెళుతున్న టీచర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్కుర్, గన్నవరం, ఉంగుటూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఆత్కుర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో పాదయాత్ర సమయంలో టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆగదని ఉపాధ్యాయులు స్పష్టం చేసారు.