జగన్ ఫ్యాక్షన్ పాలనలో... పోస్టర్ చించినా అరెస్టులే: అచ్చెన్న ఆగ్రహం
జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని టిడిపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని టిడిపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో పోలీసుల చర్యల్ని అచ్చెన్న ఖండించారు. పోస్టర్ చించిన కేసులో గ్రామంలో లేనివారిని అరెస్ట్ చేస్తారా? అరెస్టు చేసిన వారిని కోర్టుకు హాజరు పర్చకపోవడం ఏ చట్టంలో ఉంది? పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా.. వైసీపీకి ఊడిగం చేస్తున్నారా.?పోస్టర్ చించితే అరెస్ట్ చేసిన పోలీసులు.. దాడికి దిగిన వారినెందుకు అరెస్టు చేయరు.? అని ప్రశ్నించారు. అరెస్టైన కార్యకర్తలకు ఏం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని... తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.