Asianet News TeluguAsianet News Telugu

రాయపూడిలో ప్రత్యేక హెల్త్ సెంటర్... కేవలం చికిత్సే కాదు ఆ సదుపాయాలు కూడా...

గుంటూరు : జగన్ సర్కార్ తుళ్లూరు మండలం రాయపూడిలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు.

గుంటూరు : జగన్ సర్కార్ తుళ్లూరు మండలం రాయపూడిలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. కేవలం మెడిసిన్ ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఈ హెల్త్ సెంటర్ లో చికిత్స అందించనున్నారు.  అందుకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కోటి 77 లక్షల నిధులతో ఈ హెల్త్ సెంటర్ ను నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 అర్బన్ హెల్త్ సెంటర్లు వుంటే అన్నింటికంటే రాయపూడి హెల్త్ సెంటర్ ప్రత్యేకమైనదని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. వెల్ నెస్ పద్దతిలో ఇక్కడ ట్రీట్ మెంట్ ఉంటుందని... యోగా, పంచతత్వ పార్క్, వాక్ వే సదుపాయం వుంటుందన్నారు. ఈ హెల్త్ సెంటర్లో వార్డ్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చని... ఒక్కో వార్డులో ఇద్దరు చికిత్స తీసుకోవచ్చని శ్రీలక్ష్మి తెలిపారు.