Asianet News TeluguAsianet News Telugu

దేవాదాయ, అటవీ భూములు సాగుచేసినా రైతు భరోసా..: సీఎం జగన్ కీలక ప్రకటన

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతాంగానికి పెట్టుబడి సాయంకింద 'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది. 

First Published Sep 1, 2023, 4:37 PM IST | Last Updated Sep 1, 2023, 4:37 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతాంగానికి పెట్టుబడి సాయంకింద 'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలుచేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం తాజాగా అందుకోసం నిధులు విడుదల చేసారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి కౌలు రైతుల ఖాతాల్లో రూ.109.74 కోట్లు జమచేసారు. ఈ సందర్భంగా అటవీ, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందని సీఎం కీలక ప్రకటన చేసారు.