పొట్టి శ్రీరాములు జయంతి... అమరజీవికి నివాళులర్పించిన సీఎం జగన్, డిజిపి
అమరావతి: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి చివరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. సచివాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు సీఎం జగన్. ఆయనతో పాటు మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఆర్యవైశ్య నేతలు కూడా పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. ఇక మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో కూడా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.