ఏపీ రాజధాని విశాఖపట్నమే... నేనూ అక్కడికే షిప్ట్ : సీఎం జగన్ కీలక ప్రకటన

న్యూడిల్లీ : దేశ రాజధాని డిల్లీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Share this Video

న్యూడిల్లీ : దేశ రాజధాని డిల్లీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే ఏపి రాజధాని విశాఖపట్నం నుండి పాలన సాగనుందని... తాను కూడా త్వరలోనే అక్కడికి షిప్ట్ కానున్నట్లు జగన్ ప్రకటించారు. ఇలా వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి వున్నట్లు జగన్ స్పష్టం చేసారు. ఇవాళ (మంగళవారం) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న వైఎస్ జగన్ వచ్చే మార్చ్ 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

Related Video