Asianet News TeluguAsianet News Telugu

వైన్ షాప్ కు వెళ్లి... క్వాటర్ సీసాలతో రోడ్డుపైకి..: పురందేశ్వరి ఆందోళన

నరసాపురం : పశ్చిమ గోదావారి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్ లో ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

First Published Sep 21, 2023, 5:11 PM IST | Last Updated Sep 21, 2023, 5:11 PM IST

నరసాపురం : పశ్చిమ గోదావారి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్ లో ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆ పాప్ లో ఇవాళ జరిగిన మద్యం అమ్మకాలు, అందుకు సంబంధించిన బిల్లుల గురించి ఆరా తీసారు. లక్షల రూపాయల మద్యం అమ్మి కేవలం రూ.700వందలు మాత్రమే బిల్లు ఇచ్చినట్లు గుర్తించామని బిజెపి అధ్యక్షురాలు తెలిపారు. ఇలా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడటమే కాదు కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. మద్యం దుకాణం నుండి మందు బాటిల్లు తీసుకుని రోడ్డుపై పగలగొట్టి నిరసన తెలిపారు పురందేశ్వరి.

ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురయి స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిని పురందేశ్వరి పరామర్శించారు. రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి  ధైర్యం చెప్పారు. ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం అమ్మకాలపై పోరాటం చేస్తామని ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి తెలిపారు.