AP Assembly: 11 మందికి సమాధానం చెప్పడానికి భయమా? పవన్ కళ్యాణ్ కి వైసీపీ ఎమ్మెల్యేల కౌంటర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ 11 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 2019లో ఓటమి పాలైన తర్వాత 3 సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో కనిపించలేదన్నారు. ఒకరు ఆర్థిక లావాదేవీలు చూసుకుంటే, మరొకరు సినిమాలతో బిజీ అయిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పిట్ట కథలు చెబుతోందన్నారు. వైసీపీ పాలనలో జగన్ చేసిన అభివృద్ధి ఎవరిని అడిగినా చెబుతారని... తాము ప్రజల్లోనే ఉంటామని చెప్పారు.