కూటమి ఎమ్మెల్యేల నాటకాలపై అంబటి సెటైర్లు | YSRCP Ambati Rambabu Press Meet | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. 16 రోజులపాటు శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలను టీవీల్లో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా జరిగాయన్నారు. వైయస్ఆర్‌సీపీ సభ్యులు సభకు హాజరైతే సమాధానాలు చెప్పాల్సి వస్తుందని, తప్పులు ప్రజలకు తెలుస్తాయని కూటమి ప్రభుత్వం భయపడిందన్నారు. తమ పార్టీ సభ్యులు సభకు రాకూడదనే ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని విమర్శించారు. అలాగే, ప్రజా ప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఆడటంపై సెటైర్లు వేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వైఎస్ జగన్ పేరును చెప్పుకుని వికృతానందం పొందడం హేయమన్నారు.