Gudivada Amarnath Vs VijaySai Reddy: ఎన్నికల్లో గెలిస్తే ఇలా మాట్లాడతావా సాయిరెడ్డి | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 13, 2025, 4:00 PM IST

వైఎస్ జ‌గన్ కోట‌రీ అంటే ఆయనను అభిమానించే ప్రజలు, పదిహేనేళ్లుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

Read More...