చిరంజీవి టీమ్ కు అమరావతి రైతుల షాక్.. ఎందుకంటే..
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న విషయం తెలుసుకున్న రాజధాని రైతులు మద్దతు కోసం అక్కడికి చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న విషయం తెలుసుకున్న రాజధాని రైతులు మద్దతు కోసం అక్కడికి చేరుకున్నారు. అమరావతి రాజధానిగా ఉండేందుకు మద్దతు తెలపాలని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. గెస్ట్ హౌస్ వద్దకు వచ్చిన నిరసన కారులను, రైతులని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీకోసం చిరంజీవి టీమ్ ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే.