Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆందోళన... ఆశావర్కర్ మృతితో

తాడేపల్లి: ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ - 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 

 

తాడేపల్లి: ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ - 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విజయలక్ష్మి మృతి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం అని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విజయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశావర్కర్ బొక్కా విజయ లక్ష్మికి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువుల తెలిపారు. 21న తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళటంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు తెల్లవారుజామున ఆశా వర్కర్ బోక్కా  విజయలక్ష్మి మృతి చెందింది. కొలనుకొండ ఏఎన్ఎం, మల్లెపూడి ఆశా వర్కర్ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.