అప్ఘానిస్తాన్ జెండాలతో... విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అప్ఘాన్ యువకుల నిరసన

విశాఖపట్నం: తమ దేశంలో తాలిబన్లు జరుపుతున్న అకృత్యాలు, అరాచక పాలనను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆఫ్ఘానిస్థాన్ విద్యార్థులు నిరసన చేపట్టారు.

Share this Video

విశాఖపట్నం: తమ దేశంలో తాలిబన్లు జరుపుతున్న అకృత్యాలు, అరాచక పాలనను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆఫ్ఘానిస్థాన్ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఐక్యరాజ్య సమితి తాలిబన్ల చర్యలను తిప్పికొట్టి ఆఫ్ఘాన్ కు స్వాతంత్య్రం తిరిగి కల్పించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కూడా వెంటనే తాలిబన్లకు సహకారం ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తాలిబన్ పాలనలో మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిందని... అంతర్జాతీయ సమాజం స్పందించి అప్ఘాన్ లో మహిళకు రక్షణ కల్పించాలని కోరారు. ఇలా అప్ఘాన్ యువకులు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆ దేశ జెండాలతో నిరసన తెలియజేశారు.

Related Video