Asianet News TeluguAsianet News Telugu

దుర్గమ్మ సన్నిధిలో విజిలెన్స్, ఏసిబి సోదాలు... అర్చకులనూ వదలకుండా

అమరావతి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఏసిబి దాడులు చేపట్టింది.

First Published Feb 18, 2021, 4:40 PM IST | Last Updated Feb 18, 2021, 4:40 PM IST

అమరావతి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఏసిబి దాడులు చేపట్టింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ తో పాటు లడ్డూ ప్రసాదాల కౌంటర్లలో అదనంగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సంబంధిత కౌంటర్ల వద్ద స్టోర్స్ మరియు పలు విభాగాలలో కూడా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. సుమారుగా 40 మంది అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వివిధ విభాగాల్లో రికార్డు లు స్వాధీనం చేసుకుంటున్న అధికారులు.  విజిలెన్స్ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో అక్రమాలుపై దృష్టి సారించిన ఏసీబీ ప్రసాదాలు తయారీ, చీరల కౌంటర్లుతో పాటుగా వివిధ విబాగాలలో సోదాలు చేపట్టారు. వివిధ విభాగాల్లో పది ఏసిబి ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. టిక్కెట్లు కౌంటర్స్,  సెల్స్ కౌంటర్ విక్రయ కేంద్రాలు, పరిపాలన విభాగం, స్టోర్స్ లో సోదలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క బృందం లో ఏసిబి అధికారి తోపాటు విజిలెన్స్ అధికారులు, ఫుడ్ కంట్రోల్ బోర్డు సిబ్బంది వున్నారు. అర్చకుల వద్ద కూడా సోదాలు నిర్వహించిన ఏసిబి అధికారులు.