నందిగామలో అవినీతి, అక్రమాలపై ఎసిబి సీరియస్... పంచాయితీ కార్యాలయంపై దాడి
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయితీ కార్యాలయంలో ఎసిబి సోదాలు ఇవాళ (శుక్రవారం) కూడా కొనసాగుతున్నాయి.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయితీ కార్యాలయంలో ఎసిబి సోదాలు ఇవాళ (శుక్రవారం) కూడా కొనసాగుతున్నాయి. నిన్న (గురువారం) ఉదయం 11గంటలకు ఎసిబి అడిషనల్ ఎస్పీ మహారాజు ఆధ్వర్యంలోని ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐ లతో కూడిన మొత్తం 30 మంది ఎసిబి బృందం ఒక్కసారిగా పంచాయితీ కార్యాలయంపై దాడులకు దిగింది. టౌన్ ప్లానింగ్, అక్రమంగా భవనాలు, అపార్ట్మెంట్ ల నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న ఏసిబి రంగంలోకి దిగింది. పంచాయితీ కార్యాలయంలో రాత్రివరకు పలు ఫైళ్లను పరిశీలించి అధికారుల నుండి వివరాలు సేకరించిన ఎసిబి ఇవాళ కూడా తనిఖీలను కొనసాగిస్తోంది.