DSC Notification:రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు (Dsc)చేసింది. అతి త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది.
ఏపీ ప్రభుత్వం ఈ రోజు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వచ్చే నెల 15 నుంచి 30వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నది.
తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలోకి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకూ అడ్మిషన్లు స్వీకరిస్తారు.
తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 పోస్టులను టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (Telangana TRT 2023) ద్వారా భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీని చేపడతామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే. దీంతో విద్యార్ధులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర పోలీస్ ఖాళీలు 2019-20కు వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు మహారాష్ట్ర పోలీసుల అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ mahapariksha.gov.in లేదా mahapolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.