తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలోకి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకూ అడ్మిషన్లు స్వీకరిస్తారు.   

Telangana Model Schools: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మోడల్ స్కూళ్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మిగిలిన 7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లోనూ ఖాళీగా ఉన్న సీట్లకు అడ్మిషన్లు తీసుకుంటారు. ఆరో తరగతిలో అడ్మిషన్ కావాలనుకునే విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 

ఇందులో వయోపరిమితి కండీషన్ ఉన్నది. ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13 ఏళ్లు, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. బాలికలకు భోజన, వసతి సౌకర్యం ఉంటుంది. విద్యార్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పరీక్ష రాయాలి. ఎంపిక మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. ప్రతి తరగతిలో 100 మంది విద్యార్థులు ఉంటారు. మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ పొందిన వారికి ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదిరత ముఖ్యమైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

Also Read: Infosys: విప్రో వల్లే ఇన్ఫోసిస్ పుట్టింది.. ఉద్యోగం తిరస్కరించడంతో కంపెనీ ప్రారంభించా: నారాయణమూర్తి

ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ పరీక్ష 2024

ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభం: జనవరి 12
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: ఏప్రిల్ 1
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 7
రిజల్ట్ డేట్: మే 25
అడ్మిషన్ తేదీలు: మే 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు