న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా దీనికి ఎంపిక చేస్తారు.


పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు.

డిప్లొమా ట్రైనీ: 35 పోస్టులు

విభాగాల వారీ ఖాళీలు: ఎల‌క్ట్రిక‌ల్‌-30, సివిల్‌-05.

అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా  చేసి ఉత్తీర్ణులై ఉండాలి.

also read  ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌‌లో టీచింగ్ పోస్టుల ఖాళీలు

వ‌యోపరిమితి: 16.12.2019 నాటికి 27 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా.

స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.25,000 స్టైపెండ్‌గా ఇస్తారు.

జీతభత్యాలు: శిక్షణ పూర్తిచేసుకున్నవారికి జూనియర్ ఇంజినీర్ (గ్రేడ్-4) స్థాయిలో రూ.25000 - 1,17,500 వేతనం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

సర్వీస్ అగ్రిమెంట్ బాండ్: శిక్షణ పూర్తిచేసుకున్నవారు మూడేళ్ల సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. జనరల్/ఓబీసీ(NCL)/EWS అభ్యర్థులు రూ.50,000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.25,000 బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం.

మొత్తం 170 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. పార్ట్-1 నుంచి 120 ప్రశ్నలు, పార్ట్-2 నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.పరీక్ష సమయం రెండు గంటలు. పార్ట్-1లో టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది.

aslo read  Railway Jobs: రైల్వేలో ఉద్యోగ అవకాశం... ఐటీఐ అర్హత ఉంటే చాలు

పార్ట్-2లో ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి ఒకాబులరీ, వెర్బల్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫీషియన్సీ & ఇంటర్ ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రతి విభాగంలోనూ వేర్వేరుగా అర్హత సాధించాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులను రిజర్వ్‌డ్ విభాగాలకు 40 శాతం (ప్రతి పార్టులో కనీసం 30 % మార్కులు), అన్ రిజర్వ్‌డ్ విభాగాలకు 30 శాతం (ప్రతి పార్టులో కనీసం 25 %) మార్కులుగా నిర్ణయించారు.

పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, జైపూర్, డెహ్రాడూన్.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:    26.11.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:                   16.12.2019 (23:59 గం.)

పరీక్ష తేదిని ఇంకా వెల్లడించాల్సి ఉంది.