Telangana TRT Notification 2023: 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 పోస్టులను టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (Telangana TRT 2023) ద్వారా భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 పోస్టులను టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (Telangana TRT 2023) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 1,739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2,575 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 21ని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించారు.
నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ పూర్తి నోటిఫికేషన్ https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యుఎస్ కోటా అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు. అప్లికేషన్ ఫీజును రూ.1000గా నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కోసం వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు వేర్వేరు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.