ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలకు సంబంధించి లబ్దిదారులకు నేరుగా నగదును ప్రభుత్వం అందించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. బడ్జెట్ లో వ్యవసాయానికి 11589.48 కోట్లు కేటాయించింది.
బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులను ఏపీ అసెంబ్లీ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన సభ్యులను సభ నుండి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.
పేదలు, బలహీనవర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఏపీ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.