AP Budget 2023-24:డీబీటీ పథకాలకు రూ. 54,228.36 కోట్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు  కేటాయించింది.  రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన పధకాలకు సంబంధించి లబ్దిదారులకు  నేరుగా  నగదును  ప్రభుత్వం  అందించనుంది.   

AP Government allocates  Rs .54,228.36 Crore  to  DBT  Schemes

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం  డీబీటీ స్కీంలకు  బడ్జెట్ లో  భారీగా కేటాయింపులు  చేసింది.  మొత్తం  డీబీటీ  స్కీంలకు  రూ.54,228.36 కోట్లు  కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలను అర్హులకు  నేరుగా  బ్యాంకు ఖాతాల్లో  నగదును జమ చేయనున్నారు. డీబీటీ  కింద జమ చేసే పథకాల్లో  వైఎస్ఆర్ పెన్షన్ కానుక  ప్రధానమైంది.  ప్రతి నెల 1వ తేదీన  పెద్ద ఎత్తున  పెన్షన్లను  అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం,  రైతులకు  వడ్డీ లేని రుణం, వైఎస్ఆర్ కాపు నేస్తం వంటి  పథకాల కింద లబ్దిదారులకు నేరుగా  అందించనున్నారు.   

వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
వైయస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు
వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు
జగనన్న తోడు రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు
వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు
అమ్మ ఒడి రూ.6500 కోట్లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios