పేదలు, బలహీనవర్గాలకు  బడ్జెట్ లో  ప్రాధాన్యత ఇస్తామని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  చెప్పారు.  

అమరావతి: పేదలు, బలహీనవర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. 

గురువారంనాడు అసెంబ్లీకి వెళ్లే ముందు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం, మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పరిపాలనాపరమైన మార్పులకు బడ్జెట్ లో కేటాయింపులుంటాయని మంత్రి వివరించారు. పథకాలను బలపరిచి మరింత మందికి అవకాశం ఇచ్చేలా కేటాయింపులు ఇస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

also read:AP Budget 2023-24:ఆమోదం తెలిపిన కేబినెట్

బడ్జెట్ ను సమర్పించడానికి వెళ్లే ముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్ సమావేశానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.