హైదరాబాద్: ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని  టీఆర్ఎస్ తన అభ్యర్ధిగా బరిలోకి దింపుతోంది.

2009 ఎన్నికల్లో తొలిసారిగా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  2014 లో కూడ రెండో దఫా కూడ ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే  గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన టీడీపీకి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి.  ఆ తర్వాత ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కొడంగల్ లో  రేవంత్ ను దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. రేవంత్ రెడ్డి  తన రాజీనామా లేఖను గత ఏడాది అక్టోబర్ 28న చంద్రబాబుకు పంపాడు. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో మరోసారి లేఖను ఇచ్చాడు.

అయితే  ఆ రాజీనామా లేఖ ఇంతవరకు స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. అయితే ఆ సమయంలోనే రేవంత్ రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరితే ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.

మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆనాడే పార్టీ నిర్ణయం తీసుకొంది. అప్పట్లోనే మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకత్వం రేవంత్ అనుచరులను  టీఆర్ఎస్ లో చేర్పించారు.

అయితే  రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకుగాను టీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది.నరేందర్  రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి టీడీపీలో ఉన్న కాలంలో  పరిగి నియోజకవర్గం నుండి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించారు.

 2009లో పరిగిలో  ఆనాడు హరీశ్వర్ రెడ్డి టీడీపీ నుండి విజయం సాధించిన తర్వాత నాగం జనార్థన్ రెడ్డి వెంట ఉండేవాడు. ఆ తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. కాలక్రమేణా ఆయన టీఆర్ఎస్ లో చేరారు.  హరీశ్వర్ రెడ్డి  నాగం జనార్థన్ రెడ్డి వెంట 2009 నుండి 2014 కాలంలో పరిగి అసెంబ్లీ టీడీపీ ఇంచార్జీగా పట్నం నరేందర్ రెడ్డి కొనసాగారు.

చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో కొనసాగిన కాలంలో  పరిగి నుండి పట్నం నరేందర్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అయితే 2014 ఎన్నికల సమయంలోనే పట్నం మహేందర్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.  దీంతో తాండూరు నుండి  మరోసారి మహేందర్ రెడ్డి పోటీ చేశాడు. నరేందర్ రెడ్డికి టిక్కెట్టు దక్కలేదు.అయితే జిల్లాల పునర్విభజన కారణంగా  కొడంగల్  వికారాబాద్ జిల్లాలో చేరడంతో  పట్నం నరేందర్ రెడ్డికి టిక్కెట్టు దక్కింది.

ఈ వార్త చదవండి

స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

సెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

అసెంబ్లీ రద్దు: గుజరాత్ తీర్పు ఏం చెబుతోంది?