Asianet News TeluguAsianet News Telugu

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మాజీ జర్నలిస్టుల్లో ఒక్కరికి మాత్రమే టిక్కెట్టు దక్కింది. 

journalist leader kranthi contest from Andhole segment in 2019 elections
Author
hyderabad, First Published Sep 6, 2018, 4:31 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మాజీ జర్నలిస్టుల్లో ఒక్కరికి మాత్రమే టిక్కెట్టు దక్కింది. మరో జర్నలిస్టుకు టీఆర్ఎస్ జాబితాలో టిక్కెట్టు దక్కింది. చెన్నూరు నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వ విప్ గా పనిచేసిన నల్లాల ఓదేలుకు టిక్కెట్టు నిరాకరించారు కేసీఆర్. మరోవైపు మాజీ జర్నలిస్టు రామలింగారెడ్డికి మరోసారి టిక్కెట్టు కేటాయించారు.

2014 ఎన్నికల్లో చెన్నూరు నుండి నల్లాల ఓదేలు పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో  చెన్నూరు నుండి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను బరిలోకి దింపుతున్నారు. ఓదేలు కు టిక్కెట్టు ఇవ్వడం లేదు.

మరోవైపు ఓదేలు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు.  రెండు దఫాలు ఓదేలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ దఫా ఆయనకు టిక్కెట్టు నిరాకరించారు.  రామాయం పేట నుండి మాజీ జర్నలిస్టు  రామలింగారెడ్డికి  టిక్కెట్టు దక్కింది. రామలింగారెడ్డి గతంలో కూడ ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఆంథోల్ నుండి  ఓ టీవీ ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. మొత్తంగా ఇద్దరు మాజీ జర్నలిస్టుల్లో ఒక్కరికి టిక్కెట్టు నిరాకరిస్తే ... ప్రస్తుతం జర్నలిస్టుగా మరోకరికి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios