కొడంగల్:  ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు  వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ ప్రకటించారు.

మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై  వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ వివరణ ఇచ్చారు.

ముందస్తు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు  ఆమె చెప్పారు.ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొన్నామని ఎస్పీ వివరించారు.

కేసీఆర్ సభను అడ్డుకొంటామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడని  ఎస్పీ అన్నపూర్ణ గుర్తు చేశారు. కేసీఆర్ సభ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డిని విడిచిపెడతామని ఎస్పీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ కుట్ర: గీత (ఆడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు