Asianet News TeluguAsianet News Telugu

ఐటీ గ్రిడ్: కీలక సమాచారం, ఆ డేటా ఎలా వచ్చింది: సీపీ సజ్జనార్

ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేసిన సమయంలో కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు.సేవా మిత్ర యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన తెలిపారు.

we were collected key information from it grid  says vc sajjanar
Author
Hyderabad, First Published Mar 4, 2019, 3:53 PM IST | Last Updated Mar 4, 2019, 3:53 PM IST


హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేసిన సమయంలో కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు.సేవా మిత్ర యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన తెలిపారు.

సోమవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కంపెనీ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని గుర్తించినట్టు చెప్పారు.  సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని సజ్జనార్ చెప్పారు.

ఈ విచారణలో కీలకమైన ఆధారాలను సేకరించినట్టు సజ్జనార్ చెప్పారు.  నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు.ఆధార్, ఓటరు కార్డులు, కులాలు, ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారనే సమాచారాన్ని కూడ ఈ సంస్థ సేకరిస్తున్నట్టు గుర్తించినట్టుగా సజ్జనార్ చెప్పారు.

ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటాను కూడ ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉందన్నారు.ఈ డేటాను క్షుణ్ణంగా  ఐటీ గ్రిడ్ సంస్థ ఎనలైజ్ చేసినట్టుగా గుర్తించామన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థపై విచారణ కొనసాగుతోందని సజ్జనార్ చెప్పారు. ఐటీ గ్రిడ్‌కు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఐటీ గ్రిడ్ సంస్థ యజమాని ఆశోక్ కు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఇంతవరకు కూడ ఆశోక్ తమ వద్దకు రాలేదన్నారు. ఆశోక్ ఎక్కడ ఉన్నా కూడ లొంగిపోవాలని  సజ్జనార్  కోరారు.

ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని అమెజాన్ సర్వీసెస్‌లో భద్రపరుస్తున్నట్టు తేలిందన్నారు. పలువురు వ్యక్తులకు సంబంధించిన ఆధార్, ఓటరు ఐడీ కార్డుల సమాచారం మొత్తం కూడ ఈ సంస్థ సేకరించినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయమై ఆధార్ సంస్థ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను తాము విచారిస్తున్న సమయంలో  ఈ నలుగురు మిస్సైనట్టుగా పెద్ద కాకాని పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారని సజ్జనార్ గుర్తు చేశారు.  అంతేకాదు తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు అదృశ్యమైనట్టుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సజ్జనార్ చెప్పారు. 

ఏపీ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ సేకరిస్తోందని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే  ఆయనను ఏపీ పోలీసులు వేధించారని చెప్పారు.ఈ విషయమై ఏపీ పోలీసులపై కూడ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సున్నితమైన డేటాను ఎందుకు పబ్లిక్‌లో పెట్టారని సజ్జనార్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టబోమని సజ్జనార్ ప్రకటించారు.ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే ఓట్ల తొలగింపు విషయమై 45 కేసులు నమోదైనట్టుగా సజ్జనార్ గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ఓట్ల తొలగింపు కోసం  ప్రయత్నించారా అనే విషయమై దర్యాప్తులో తేలనుందన్నారు.

ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటా ఐటీ గ్రిడ్ సంస్థకు ప్రభుత్వం నుండి వచ్చిందా, మూడో వ్యక్తి నుండి వచ్చిందా అనే విషయమై  ఆరా తీస్తున్నట్టుగా  సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైద్రాబాద్ కేంద్రంగా ఉందన్నారు. ఫిర్యాదు కూడ హైద్రాబాద్‌లోనే ఇచ్చిన విషయాన్ని సజ్జనార్ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

మా జోలికొస్తే ...ఖబడ్దార్: కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios