అమరావతి: ఏపీ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల డేటా చోరీ ఆరోపణలపై  ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన  చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.

ఆదివారం నాడు  అమరావతిలో  ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్  దమ్మాలపాటి శ్రీనివాస్‌తో చంద్రబాబునాయుడు సుమారు గంటకు పైగా చర్చించారు. డేటా చోరీ అంశంపై హైద్రాబాద్ కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు, ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే విషయమై చంద్రబాబునాయుడు ఏజీతో చర్చించారు.

ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు