హైదరాబాద్: ఏపీ పోలీసులు తనను బెదిరిస్తున్నారని కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఐటీ గ్రిడ్స్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీకైందని తాను ఫిర్యాదు చేస్తే ఏపీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఆదివారం నాడు గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల డేటా ప్రైవేట్ సంస్థలకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు.ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే  తనపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు..

సామాజిక కార్యకర్తగా, టెక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా తాను  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఏపీలో దొంగ ఓట్లపై ప్రశ్నించినట్టు చెప్పారు. తాను ఈ విషయమై ఫిర్యాదు చేసిన సమయం నుండి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. 

అరగంట పాటు పచ్చి బూతులు తిడుతూ ఏపీ పోలీసులు తనను బెదిరించారని ఆయన తెలిపారు.తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్టుగా లోకేశ్వర్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు