Asianet News TeluguAsianet News Telugu

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు తనిఖీలు నిర్వహించారు. 

ap police searching for bhasker at hyderabad in telangana
Author
Hyderabad, First Published Mar 3, 2019, 12:08 PM IST

హైదరాబాద్:మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు తనిఖీలు నిర్వహించారు. డేటా చోరీ చేస్తున్నారనే ఫిర్యాదుపై ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సైబరాబాద్ పోలీసులు.

ఇదిలా ఉంటే ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కన్పించడం లేదని గుంటూరు పోలీసులకు  ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.  భాస్కర్ కోసం మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి  ఏపీ పోలీసులు వచ్చారు. అయితే డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు సైబరాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకు వివరించారు.

అయితే భాస్కర్‌ను తమకు అప్పగించాలని తెలంగాణ పోలీసులను కోరిన ఏపీ పోలీసులు. ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకుడు ఆశోక్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.ఏపీ ప్రభుత్వానికి చెందిన ఓటర్, ఆధార్, లబ్దిదారుల డేటా మాదాపూర్‌ అయ్యప్ప సోసైటీలోకి ఐటీ గ్రిడ్  సంస్థకు అప్పగించిందని వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios