Asianet News TeluguAsianet News Telugu

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. డేటావార్  విషయమై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిచ్చు రేగింది. ఏపీ పోలీసులకు కూకట్‌పల్లిలో తెలంగాణ పోలీసులు నో ఎంట్రీ చెప్పారు. 

ap police tries for interrogation lokeshwar reddy in kukatpally
Author
Hyderabad, First Published Mar 3, 2019, 1:33 PM IST

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. డేటావార్  విషయమై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిచ్చు రేగింది. ఏపీ పోలీసులకు కూకట్‌పల్లిలో తెలంగాణ పోలీసులు నో ఎంట్రీ చెప్పారు. 

ఏపీ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల డేటా చోరీకి గురైందని వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు.

కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తి కూడ ఏపీ లబ్దిదారుల డేటా విషయమై ఫిర్యాదు చేశారు.  ఆదివారం నాడు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి  ఏపీ పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే ఏపీ పోలీసులను లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు సహకరించలేదు.  కూకట్‌పల్లి ఫార్చూన్‌ఫీల్డ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

ఐటీ గ్రిడ్‌కు సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కన్పించడం లేదంటూ ఆ సంస్థకు చెందిన ఆశోక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీ పలు సంస్థలకు యాప్‌లను తయారు చేస్తోంది. ఏపీలోని టీడీపీ సేవా మిత్రను కూడ ఇదే సంస్థ తయారు చేసింది. 

అయితే ఈ సంస్థ వద్ద ఏపీకి చెందిన లబ్దిదారుల జాబితా ఉందనే విషయమై వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి వారం రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రకమైన ఫిర్యాదును రెండు రోజుల క్రితం లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. 

మరోవైపు ఐటీ గ్రిడ్ విషయమై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహిస్తున్నారు.  ఇవాళ సాయంత్రం ఈ విషయమై సైబరాబాద్ పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. 

తమ పార్టీకి చెందిన డేటాను వైసీపీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని  టీడీపీ ఆరోపణలు చేస్తోంది. టీడీపీ వ్యవస్థలను నాశనం చేసేందుకు వైసీపీకి టీఆర్ఎస్‌ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.ఆదివారం నాడు ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఈ విషయమై విమర్శలు చేశారు.

విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగడంపై మరోసారి ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు తేటతెల్లమయ్యాయని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

ఇదిలా ఉంటే  తమ పార్టీకి చెందిన సానుభూతిపరులు, నేతల ఓట్లను తొలగిస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

:

Follow Us:
Download App:
  • android
  • ios