Asianet News TeluguAsianet News Telugu

స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, తాత వెంట పొలానికి వెళ్లి.. కాలువ గుంతలో పడిన ఇద్దరు చిన్నారులు.. ఊపిరాడకపోవడంతో

స్కూల్ కు సెలవు ఉందని తాత వెంట పొలానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఓ కాలువ గుంతలో పడి చనిపోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లా చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది.

Two children who went to the farm with their grandfather and fell into the ditch..ISR
Author
First Published Jul 22, 2023, 6:53 AM IST

సరదాగా తాత వెంట పొలానికి వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. తాత పొలంలోనే పని చేస్తూ ఉండగానే.. మధ్యలోనే తాము ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఓ కాలువ గుంతలో పడిపోయారు. ఊపిరాడకపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం పోటీ పరీక్షలు ప్రవేశపెట్టే ప్రతిపాదనేమీ లేదు - రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం

ఆముదంబండ తండాకు చెందిన తేజ్యనాయక్ ఇస్లావత్‌ లాలు, శ్రీను అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి వివాహాలు జరిగాయి. ఇందులో లాలుకు 9 ఏళ్ల కుమారుడు ప్రవీణ్, శ్రీనుకు 7 ఏళ్ల కూతురు వైష్ణవి ఉన్నారు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న స్కూల్ లో చదువుకుంటున్నారు. ప్రవీణ్ రెండో తరగతి చదువుతుండగా.. వైష్ణవి ఒకటో తరగతి చదువుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలువులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

సీమా హైదర్ కు భారత పౌరసత్వం ఇవ్వాలి - సచిన్ మీనా తండ్రి డిమాండ్

దీంతో ఈ పిల్లలు ఇద్దరూ చదువుతున్న స్కూల్ కు కూడా సెలవు ఇచ్చారు. దీంతో ఈ పిల్లలు ఇద్దరూ శుక్రవారం తాత తేజ్యనాయక్ తో సరదాగా పొలానికి వెళ్లారు. అయితే తాత పొలంలోనే ఉండగా.. తాము ఇంటికి వెళ్తామంటూ చెప్పి మధ్యాహ్నం సమయంలోనే బయలుదేరారు. అయితే సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. స్థానికంగా వెతికారు. కానీ అప్పటికీ వారి జాడ కనిపించలేదు. 

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్

దీంతో పొలం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో దారి గుండా ఉన్న కాలువ కోసం తవ్విన గుంటను కూడా గమనిస్తూ వెళ్లారు. అయితే ఓ గుంతలో చిన్నారులిద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో ఎస్ఐ శ్రీహరి అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఒకే రోజు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios