సీమా హైదర్ కు భారత పౌరసత్వం ఇవ్వాలి - సచిన్ మీనా తండ్రి డిమాండ్

పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన యూపీ యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. కొన్ని నెలలుగా ఆమె తన పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటోంది. అయితే ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఆ యువకుడి తండ్రి రాష్ట్రపతి భవన్ ను సంప్రదింనున్నాడు. 

Seema Haider should be given Indian citizenship - Sachin Meena's father demands..ISR

పాకిస్థాన్ నుంచి తన నలుగురు కుమార్తెలతో వచ్చి యూపీలో నివాసం ఉంటున్న సీమా హైదర్ ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె వ్యవహారం రాష్ట్రపతి భవన్ కు చేరింది. సీమా హైదర్ ప్రియుడు సచిన్ మీనా తండ్రి ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ను సంప్రదించి ఆమెకు భారత పౌరసత్వం కోరనున్నారు. 

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్

దీని కోసం సచిన్ తండ్రి తన లాయర్ తో కలిసి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరాడని ‘ఇండియా టీవీ’ నివేదించింది. అక్కడి అధికారులను కలిసి ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వాలని వారు కోరనున్నారు.

మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని ఫిర్యాదు.. ప్రిన్సిపాల్, సూడెంట్లకు మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

కాగా.. సీమా హైదర్ (30), సచిన్ మీనా (22)లను జూలై 4న గ్రేటర్ నోయిడాలో స్థానిక పోలీసులు అరెస్టు చేయగా, జూలై 7న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సచిన్ తో ఉండేందుకు సీమా తన నలుగురు పిల్లలతో కలిసి మే నెలలో నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్ లో వివాహం చేసుకున్నామని చెప్పుకున్న ఈ జంటకు 2019లో ఆన్ లైన్ గేమ్ పబ్ జీ ద్వారా పరిచయం ఏర్పడింది.

సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సినీ నటికి ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్ ఆఫర్.. హోటల్ కు వెళ్లగానే అత్యాచారం..

మరోవైపు ఉత్తరప్రదేశ్ పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి సీమా హైదర్ ను విచారిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ కు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. ఈ విషయం తమకు తెలుసని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులకు తెలిపారు. ‘‘ఆమె (సీమా హైదర్) కోర్టు నుంచి బెయిల్ పొంది బెయిల్ పై బయటకు వచ్చింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇది న్యాయపరమైన అంశం, దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి అంతకుమించి నేనేమీ చెప్పదలచుకోలేదు’’ అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios