హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం పోటీ పరీక్షలు ప్రవేశపెట్టే ప్రతిపాదనేమీ లేదు - రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం
రాజ్యాంగ నిబంధనల ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ సాగుతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఆ పదవులను భర్తీ చేసేందుకు పోటీ పరీక్షలు పెట్టే ప్రతిపాదనేమీ లేదని అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం పోటీ పరీక్షను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏమీ లేదని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారిని నియమిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ఈ మేరకు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు బదులిస్తూ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
సీమా హైదర్ కు భారత పౌరసత్వం ఇవ్వాలి - సచిన్ మీనా తండ్రి డిమాండ్
హైకోర్టు జడ్జీల నియామకానికి పోటీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టును సంప్రదించాలని ప్రభుత్వం యోచిస్తోందా ? అని హైకోర్టు న్యాయమూర్తులపై లఘు ప్రశ్నకు అనుబంధంగా మంత్రిని సభ్యులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 224 ప్రకారం, 1993 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి 1998లో రూపొందించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లో నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని మేఘ్వాల్ వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(2)ను తెలియజేస్తూ.. ఒక భారత పౌరుడు, కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో న్యాయ పదవిని నిర్వహించి, కనీసం పదేళ్లు లేదా వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టులకు హైకోర్టు న్యాయవాదిగా ఉంటే తప్ప హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హుడు కాదని ఆయన అన్నారు.
మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం.. ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు.. వీడియో వైరల్
కాగా.. దేశంలో 1,114 మంది న్యాయమూర్తులతో 25 హైకోర్టులు ఉండగా, జూలై 1 నాటికి 333 ఖాళీలు ఉన్నాయని న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది.