Asianet News TeluguAsianet News Telugu

ఛార్జీలు పెంచుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పే రోజులు దగ్గరకొచ్చాయి: YSR తెలంగాణ ప్రతినిధి పిట్ట రాంరెడ్డి

ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్  ల‌క్ష‌ల కోట్ల అప్ప‌లు తెచ్చి  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడని విమ‌ర్శించారు. కేసీఆర్ బంగారు తెలంగాణ‌లో పేద‌ల‌కు బ‌తుకు భార‌మ‌వుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు 

ts ysrcp Spokesperson Pitta Ramreddy fires on cm kcr on electricity charges
Author
Hyderabad, First Published Dec 28, 2021, 6:24 PM IST

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేర‌కు  డిస్కమ్‌లు (Telangana power distribution companies) ఇప్పటికే టీఎస్ ఈఆర్‌సీకి (Telangana State Electricity Regulatory Commission) (TSERC) ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌.. టారిఫ్‌ (tariff) ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాయి.
సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50పైసలు, వాణిజ్య వినియోగదారులకు రూపాయి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష YSR తెలంగాణ పార్టీ  భంగుమన్న‌ది. రాష్ట్ర‌ప్ర‌జ‌లు క‌రోనాతో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే కేసీఆర్ ప్ర‌భుత్వం ధరలు పెంచుతూ పేదల మీద భారం మోపుతోంద‌ని YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి విమ‌ర్శించారు. 

మంగ‌ళ‌వారం YSR తెలంగాణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏపూరి సోమన్న, పిట్ట రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిట్ట రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ..‘కరెంటు ఛార్జీలు పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మరోసారి సామాన్యుల నడ్డి విరిచేలా ఉందనీ. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) కరెంటు చార్జీలు పెంచుతున్నామని చెప్పి రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్ సీ)కి ప్రతి పాదనలు పంపడం దుర్మార్గమైన చర్య అని మండిప‌డ్డారు.

Read Also: TSRTC Bus fare hike: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు చార్జీలు.. కిలో మీటర్‌కు ఎంత పెంచనున్నారంటే..!

ఇటీవల ఆర్టీసీ టికెట్ చార్జీలు పెరగడంతో పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజలపై కేసీఆర్ వేస్తున్న ధరల భారాలతో అవస్థలు పడుతున్నారని అన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదనీ, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా వైయస్ఆర్ సుపరిపాలన అందజేశారని, ఆయ‌న  ఎప్పుడూ పేదల బాగోగుల కోసం ఆలోచించేవారని అన్నారు. 
కానీ, కేసీఆర్ మాత్రం పేద‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని, బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు బతుకేలేని తెలంగాణగా మారుస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం  చేశారు.

Read Also: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్... ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణకు గ్రీన్‌సిగ్నల్

ధనిక రాష్ట్రంగా ఉన్నా.. తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మారిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుందని, కోట్లాడి అప్ప‌లు తెచ్చి..  ప్రజలపై భారాలను మోపుతున్నారనీ, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు తీసుకుంటూ లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అమ్మే స్థితికి కేసీఆర్ దిగజార్చారని ఆరోపించారు.  బంగారంలా ఉన్న సెక్రెటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రెటేరియట్ నిర్మిస్తున్నారనీ, తెలంగాణపై దాదాపు రూ.4లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని విమ‌ర్శించారు. హర్యానాలో రైతులు చనిపోతే రూ.3లక్షలు ఇస్తామన్న కేసీఆర్ తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు చనిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదనీ. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పర్మామర్శించలేదని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.  ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాష్ట్రంలో రూ.10వేల కోట్లు విద్యుత్ బకాయి ఉందని, ప్రజలపై భారం మోపడం సరైంది కాదనీ. కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోకపోతే పోరాటానికైనా సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. 

Read Also: కేసీఆర్ సింహమైతే బండి కొండముచ్చు... రేవంత్ కోతి... తరుణ్ చుగ్ ఎలుక: జీవన్ రెడ్డి సంచలనం

 తెలంగాణ వస్తే ఛార్జీలు తగ్గుతాయని ప్రజలు అనుకుంటే.. పెంచడమేమిటి..? ప్రతీ ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్ కు 50పైసలు, ఇతర కనెక్షన్ లపై యూనిట్ కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు చేయాలనుకుంటున్నారని,  తెలంగాణలో 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే కుటుంబాలు దాదాపు 40లక్షలు ఉన్నాయి. వీరందరికీ ధరల పెరుగుదలతో విద్యుత్ ఛార్జీలు భారంగా మారుతాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎల్ టీ-1(ఏ), ఎల్ టీ -1(బీ1), ఎల్ టీ -1(బీ2) పేరుతో చార్జీలు పెంచుతూ..  ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందనీ,  గతంలో 1 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి యూనిట్ కు 3.30 రూపాయల వ‌సూలు చేసే.. ఇప్పుడూ.. 3.80పైసలకు పెంచనున్నారనీ, 101 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి యూనిట్ కు 4.30 వ‌సూల్ చేస్తే.. ఇప్ప‌డూ 4.80 పైసల మేర‌ పెంచనున్నారని తెలిపారు.

అలాగే..  ఒకటి నుంచి 201కి పైగా విద్యుత్ వినియోగిస్తే రూ.5 నుంచి రూ.5.50 పైసలు . 201 పైగా యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి ప్రతీ యూనిట్ పై అదే ఛార్జీలు వసూలు చేయడం దారుణ‌మని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ స్లాబ్ లను రద్దు చేసి ప్రతీ యూనిట్ కు ఒకే ఛార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ నిరంకుశ పాలనను ఎండగడుతూ పేదల పక్షాన పోరాడతామ‌ని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios