విద్యుత్‌ బకాయిల చెల్లింపుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని కేంద్రం తెలిపింది. రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయి రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ స‌మాధాన‌మిస్తూ.. తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి లేఖ రాసినట్లు చెప్పారు. 

Power Dispute: విద్యుత్‌ బకాయిల చెల్లింపు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు మోడీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. ఈ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న విద్యుత్‌ బకాయిల చెల్లింపు వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఆర్‌కె సింగ్ తెలిపారు.

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ స‌మాధాన‌మిస్తూ.. తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు తెలిపారు. 

Read Also: రాత్రి భోంచేసి పడుకున్నారు.. తెల్లారే సరికి ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కింద పడిన యువతి..

విద్యుత్‌ సరఫరా అనేది ఇరు రాష్ట్రాల మ‌ధ్య ద్వైపాక్షిక ఒప్పంద‌మ‌న్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగిందని, మొదట్లో ఏపీ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు చేశామని తెలిపింది. 

Read Also: Omicron: భార‌త్ లో ఒమిక్రాన్ డ‌బుల్ సెంచ‌రీ !

ఇక్క‌డ బ‌కాయిప‌డ్డ సొమ్ము విష‌యంలో ఎలాంటి స‌మస్య లేద‌ని, కానీ అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదం త‌లెత్తిందని మంత్రి తెలిపారు. వడ్డీ చెల్లింపుపై విష‌యంలో ఇరు రాష్ట్రాలు సామ‌ర్యంగా చ‌ర్చించుకుని.. ఓ విష‌యంలో క్లారిటీ రావాల‌ని మంత్రి తెలిపారు. విద్యుత్‌ బకాయిల చెల్లింపులో తెలంగాణ స‌ర్కార్ జాప్యం చేయ‌డంతో ఏపీ స‌ర్కార్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించుకోవడమే స‌రైన‌ మార్గమని ప‌లువురు సూచించారు. తాజాగా.. కేంద్రం కూడా ఈ విష‌యాన్నే స్ప‌ష్టం చేసింది.