Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్... ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణకు గ్రీన్‌సిగ్నల్

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు (rice procurement) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. 
 

center green signal for rice procurement in kharif season in telangana
Author
Hyderabad, First Published Dec 28, 2021, 3:33 PM IST

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు (rice procurement) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో పండించిన (kharif season) ధాన్యం మొత్తాన్ని సేకరించాలని సెప్టెంబర్‌లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ సర్కార్. అయితే ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. 

ఇకపోతే.. బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) పార్టీలు రెండూ ఒకే ర‌క‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి (niranjan reddy) ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఎక్క‌డున్నాయ‌ని అన్నారు. యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేందుకు మాత్ర‌మే వ‌స్తార‌ని విమ‌ర్శించారు. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి తెలంగాణ ప్ర‌భుత్వం గౌర‌వం తెచ్చింద‌ని చెప్పారు. సుధీర్ఘ కాలం పాటు పాలకులు విస్మ‌రించిన వ్య‌వ‌సాయానికి తిరిగి ప్రాణం పోసింది సీఎం కేసీఆర్ (kcr) అని కొనియాడారు. 

Also Read:యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేటోళ్లు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు - మంత్రి నిరంజన్ రెడ్డి

దేశంలో వ్య‌వ‌సాయ రంగానికి తెలంగాణ మాత్ర‌మే అధికంగా ఖ‌ర్చు చేస్తోంద‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏడాది రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, ఇత‌ర రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాలు కోసం రూ.60 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని తెలిపారు. తెలంగాణ వ‌రి రైతుల కోసం స్వ‌యంగా సీఎం కేసీఆర్ ధ‌ర్నా చేశార‌ని గుర్తు చేశారు. తెలంగాణలో యాసంగి సీజ‌న్‌లో దాదాపు ఒక కోటి 70 ల‌క్షల వ‌ర‌కు ధాన్యం పండుతుంద‌ని, అదంతా బాయిల్డ్ రైసేన‌ని అన్నారు. ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ వ‌ద్దంటే ఏం చేయాలో తెలియ‌క‌నే తెలంగాణ రైతాంగానికి వ‌రి వేయొద్ద‌ని సూచించామ‌ని తెలిపారు. 

రైతుల‌ను రెచ్చ‌గొట్టి రెండు పార్టీల నాయ‌కులు వ‌రి వేయాల‌ని సూచిస్తున్నార‌ని, కానీ ఆ పంట‌ను రైతులు ఎక్క‌డ అమ్ముకోవాల‌ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శలు చేశారు. సోమవారం నాడు కూర్చుని మంగళవారం రావాలని దీక్ష చేసినట్లుంది ఆయ‌న తీర‌ని అన్నారు. జోన‌ల్ స‌మ‌స్య‌లు అన్నీ తీరిపోయాయ‌ని త్వ‌ర‌లోనే ఉద్యోగ నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌ని చెప్పారు. కేంద్రంలో ప్ర‌భుత్వంలో 8,72,243 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల‌కు (kishan reddy) ద‌మ్ముంటే వెంట‌నే ఆ ఖాళీల‌ను భ‌ర్తీ చేపించాల‌ని స‌వాల్ విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios