తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, ఇంచార్జి తరుణ్ చుగ్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ (telangana congress), బీజేపీ (BJP) నేతలు కోతులు, కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) సంచలన వ్యాఖ్యలు చేసారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కోతి అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కొండ ముచ్చులా మారారని అన్నారు. సంజయ్ కు నెత్తి లేదు నత్తి మాత్రమే ఉందని... రేవంత్ కు కత్తి లేదు నత్తి, సుత్తి రెండు ఉన్నాయంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేసారు. 

హైదరాబాద్ (hyderabad) లోని టీఆర్ఎస్ఎల్పీ (TRLP) కార్యాలయంలో పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... సోమవారం రేవంత్, బండి సంజయ్ చేపట్టిన నిరసన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. కోవిడ్ (COVID19) మార్గదర్శకాల నేపథ్యంలో వారి నిరసనలకు పోలీసులు అనుమతించలేదని... రాష్ట్ర ప్రభుత్వం కావాలనేం ఆంక్షలు విధించలేదన్నారు. అయినా ఈ నిబంధనలు కేంద్రం విధించినవే అని వారిద్దరికీ తెలియవా? నిలదీసారు. రాష్ట్ర హై కోర్టు సూచనలు కూడా తెలియవా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 

''అక్కరకు రాని అంశాలపై రేవంత్, బండి రచ్చ చేస్తున్నారు. తెలంగాణ ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ (neeti ayog) మెచ్చుకుంది... ఇలాంటివి మాత్రం వారికి కనబడడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్ లా కలిసి పని చేస్తున్నారు. ఆ రెండు పార్టీ ల ఆఫీసులు నాంపల్లి లొనే ఉన్నాయి కదా'' అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేసారు.

read more కాంగ్రెస్‌లో రచ్చబండ 'రచ్చ': రేవంత్‌పై సీనియర్ల గుర్రు

''సోషల్ మీడియాలో హల్ చల్ తప్ప రేవంత్, బండిని ప్రజలు పట్టించుకోవడం లేదు. అబద్దాలకు రేవంత్ ప్రతినిధి అయితే అరాచకాలకు బండి సంజయ్ ప్రతినిధి. రేవంత్ పిలుపునిచ్చిన రచ్చబండ కాంగ్రెస్ కు గుదిబండలా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడిగిన ప్రశ్నలకి ముందు రేవంత్ సమాధానం చెప్పాలి'' అని అన్నారు. 

''సీఎం కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధం... అక్కడ అంత భూమే లేదు. అయినా కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటే తప్పుబట్టాలి. అయినా ఇకపై కొనుగోలు కేంద్రాలే లేకపోతే ఎవరు కొంటారు'' అన్నారు. 

''రేవంత్ ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతోంది. సోనియా, రాహుల్ లను తెలంగాణ వరి ధాన్యంపై మాట్లాడమని రేవంత్ ఎందుకు అడగలేదు. బండి సంజయ్ కేసీఆర్ దీక్ష గురించి వంకరగా మాట్లాడితే ఆ దేవుడే అతన్ని శిక్షిస్తాడు. కేసీఆర్ దీక్ష లేకపోతే కాంగ్రెస్, బీజేపీ లకు తెలంగాణ శాఖలు ఉండేవా. కాంగ్రెస్, బీజేపీ సీఎంలను హైద్రాబాద్ రప్పిస్తే పథకాలు ఎలా ఉండాలో కేసీఆర్ వారికి క్లాస్ లు చెబుతారు. రైతు బంధు (rythu bandhu), కళ్యాణాలక్ష్మి (kalyana laxmi) లాంటి పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? చత్తీస్ ఘడ్ కన్నా ఎన్నో పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయ్'' అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

read more కొందరు పార్టీని నాశనం చేయాలని చూశారు: తుమ్మల సంచలనం

''అమృత్ సర్ లో గెలవని తరుణ్ చుగ్ (tarun chug) ది సీఎం కేసీఆర్ (cm kcr) ను విమర్శించే స్ధాయా. కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదు చుగ్ వయసు. కేసీఆర్ సింహం లాంటోడు.. అలాంటిది ఆయన గురించి ఎలుక లాంటి తరుణ్ చుగ్ మాట్లాడటమా. కేసీఆర్ ని నాదర్శా తో పొలుస్తాడా... నాదిర్షా ఇరాన్ నుంచి వచ్చి ఇండియా పై దండెత్తాడు. కానీ కేసీఆర్ తెలంగాణ లోకల్, వోకల్. అమిత్ షా నే తెలంగాణ పాలిట నాదిర్షా. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ పై దండెత్తుతున్నాడు. అయనా వారి ఆటలు తెలంగాణ లో నడవవు'' అని మండిపడ్డారు.

''150 ఎకరాలు ఏ నాయకుడికి ఉండవు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం51 ఎకరాలకు మించి ఉండకూడదు. అన్నీ అబద్ధపు ప్రచారాలే. తప్పుడు పత్రాలు చూపించడం లో రేవంత్ సిద్ధహస్తుడు. రేవంత్ చూపింది, చెప్పింది ఇప్పటిదాకా ఏదీ నిజం కాలేదు. బ్లాక్ మెయిలింగ్ తప్ప రేవంత్ కు ఏదీ చేత కాదు'' అని ఆరోపించారు. 

''గుజరాత్ బేరగాళ్లతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? నిరుద్యోగం గురించి బండి సంజయ్ ఏదైనా చెప్పాలనుకుంటే ప్రధాని మోడీ కి చెప్పాలి... కేసీఆర్ కు కాదు. ప్రభుత్వ, ప్రైవేటు పరంగా భారీగా ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణయే. మేము రాష్ట్ర ఉద్యోగాల లెక్కాలిచ్చాం. బండి సంజయ్ కేంద్ర ఉద్యోగాల గురించి మాట్లాడాలి. లెక్కలు ఇవ్వాలి'' అని డిమాండ్ చేసారు. 

''సీఎం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని కొందరు అష్టదరిద్రులుగా మారిపోయారు. రైతు బంధు మరో విడత కూడా రైతుల అకౌంట్లలో నేటి నుంచి జమ అవుతోంది. ఇలాంటి పథకం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా? తెలంగాణ పనితనమేమిటో నీతి ఆయోగ్ ప్రపంచానికి చాటినా ప్రతిపక్షాలకు కనబడటం లేదు. చండీగఢ్ మున్సిపాలిటీ లో కూడా బీజేపీ ఓడిపోయింది... అక్కడ గెలవని వాళ్ళు ఇక్కడ గెలుస్తారా?'' అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేసారు.