తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడిచి రేవంత్ వేలకోట్లు సంపాదించాడని ఆరోపించారు.

ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని... ఈ వ్యవహారానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదన్నారు. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్ రెడ్డి ఇళ్లో ఏనాడు ఐటీ సోదాలు జరగలేదని అన్నారు.

వేల కోట్ల ఆస్తులు రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయని బాల్కసుమన్ ప్రశ్నించారు. రేవంత్ ఒక దేశద్రోహి అని.. ఇతని వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తామని.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతామన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో పట్టుకున్న రూ.50 లక్షల కారణంగా మొత్తం గుట్టు బయటకు తెలిసిందని సుమన్ అన్నారు. దేశభక్తుడిని అని చెప్పుకునే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దొడ్డి దారిలో డబ్బులు సంపాదించిన రేవంత్‌ను ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. 

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

అధికారంలోకి వచ్చాక మేము దాడులు చేయిస్తే.. మీ గతి ఏంటీ: డీకే అరుణ

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన