తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత డీకే అరుణ. ఆమె ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి.. అక్కడి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌పై దాడిని ఖండించారు.

ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారో వారిపై కుట్రపన్ని కేసుల్లో ఇరికిస్తున్నారని అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందన్నారు.

ప్రతిపక్షాలపై అధికారపక్షం కేసులు పెడితే ఏం జరుగుతుందో.. తమిళనాడు మంచి ఉదాహరణ అని.. అక్కడి నేతలకు ఏ గతి పట్టిందో టీఆర్ఎస్‌కు అదే గతి పడుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా.. ఇలాగే చేస్తే... టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటని అరుణ ప్రశ్నించారు.

సహారా కేసులో కేసీఆర్‌, హరీశ్ రావు‌లపై కేసులు ఉన్నాయని.. సీబీఐ అధికారులు సీఎం ఫాంహౌస్‌పై దాడి చేశారని.. మరిప్పుడు ఆ కేసులన్నీ ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారని అరుణ అన్నారు.

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

ఇంటికి రేవంత్...తీవ్ర ఉద్రిక్తత : అరెస్టుకు రంగం సిద్దం?

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి