- Home
- Jobs
- Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఎలాంటి అనుభవం లేకపోయినా సరే ఉద్యోగాలను ఇస్తోంది... తాజాగా ప్రెషర్స్ కోసమే జాబ్స్ ప్రకటించింది. 2024, 2025లో డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు అనలిస్ట్ ట్రైనీలుగా అవకాశం ఇస్తోంది.

ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రెషర్స్ కి ఉద్యోగాలు
మీరు డిగ్రీ పూర్తిచేసి సాప్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు అద్భుత అవకాశం. తెలుగు యువత ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు... హైదరాబాద్ లోనే ఐటీ జాబ్ సాధించవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అనుభవం లేని ప్రెషర్స్ కు అవకాశం ఇస్తోంది ఈ గ్లోబల్ ఐటీ కంపెనీ.
వెంటనే దరఖాస్తు చేసుకొండి
ఎలాంటి వర్కింగ్ అనుభవం లేకున్నా పర్లేదు... ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారికి అవకాశం ఇస్తోంది కాగ్నిజెంట్. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 అనలిస్ట్ ట్రైనీ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. 2024, 2025లో డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2025.
కాగ్నిజెంట్ లో భర్తీచేసే ఉద్యోగాలివే..
మొదటి పోస్ట్ అనలిస్ట్ ట్రైనీ – ఐటీ & ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్. ఈ ఉద్యోగానికి బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటివి) చదివిన వారు అర్హులు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు కనీసం 60% మార్కులతో పాసై ఉండాలి, అరియర్స్ ఉండకూడదు.
రెండో పోస్ట్ అనలిస్ట్ ట్రైనీ – మల్టీక్లౌడ్. దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీవోక్, బీఎంఎస్ వంటి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో పాసైతే చాలు
మూడో పోస్ట్ అనలిస్ట్ ట్రైనీ – డిజిటల్ వర్క్‌ప్లేస్ సర్వీసెస్‌కు కూడా పైన పేర్కొన్న అర్హతలే వర్తిస్తాయి.
ఈ అర్హతలు కూడా ఉండాలి...
ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇంగ్లీషులో మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి… అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే టీమ్ వర్క్, అనలిటికల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. నైట్ షిఫ్ట్‌తో సహా ఏ షిఫ్ట్‌లోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. నైట్ షిఫ్ట్‌కు అదనపు అలవెన్స్ ఇస్తారు.
హైదరాబాద్ లోనూ ఉద్యోగం...?
ఇవి పాన్ ఇండియా ఉద్యోగాలు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో పోస్టింగ్ ఉండొచ్చు. జీతం నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. రెస్యూమ్, ఫోటో, సర్టిఫికెట్లు, పాన్, ఓటర్ ఐడీ అవసరం. గత 6 నెలల్లో కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి హాజరైన వారు దరఖాస్తు చేయవద్దు... వారికి అవకాశం ఉండదు. అర్హులు వెంటనే అప్లై చేయండి.

