
Megastar Chiranjeevi inspiring story: ఆరోజు బీర్ తాగలేదు.. అందుకే మెగాస్టార్ అయ్యా
మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. 48 ఏళ్ల క్రితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో స్నేహితులు బీర్ తాగమని ఒత్తిడి చేసినా.. తాను ఆంజనేయస్వామి భక్తుడినని చెప్పి తిరస్కరించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సందేశమిచ్చారు. డ్రగ్స్‌కు బానిసలైన స్నేహితులను అసహ్యించుకోవద్దని, వారికి అండగా నిలిచి సరైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి పూర్తి ప్రసంగం.. ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో చూడండి