గుంటూరులో దారుణం.. 11 ఏళ్ల గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్. తండ్రిని బెదిరించి, రెండు రోజుల తరువాత మళ్లీ అఘాయిత్యం

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలికను ఇద్దరు దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. నిలదీసిన తండ్రినే బెదిరించారు. రెండు రోజుల తరువాత మళ్లీ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

Atrocious in Guntur.. Gang rape of 11-year-old tribal girl. After threatening the father, two days later the violence again..ISR

ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. మహిళపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో అలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.

స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, తాత వెంట పొలానికి వెళ్లి.. కాలువ గుంతలో పడిన ఇద్దరు చిన్నారులు.. ఊపిరాడకపోవడంతో

ఓ 11 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బెదిరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలియడంతో తండ్రి వారిని నిలిదీశారు. దీంతో అతడినీ ఆ దుండుగులు బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అతడు భయపడి ఈ ఘటనను బయటపెట్టలేదు. కానీ మళ్లీ రెండు రోజుల తరువాత ఆ కామాంధులు మళ్లీ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో తట్టుకోలేని ఆ తండ్రి ఏమైతే అది అవుతుందని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. 

ఢిల్లీలో మరోసారి ప్రమాదస్థాయిని దాటిన యమునా నీటిమట్టం..

పోలీసులు, బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల గిరిజన బాలిక తన తల్లిదండ్రులుతో కలిసి నివసిస్తోంది. తన ముగ్గురు తోబుట్టువులందరికీ వివాహాలు అయ్యాయి. దీంతో వారంతా వేరు వేరుగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో చివరిదైన ఆ బాలికను తల్లిదండ్రులు చూసుకుంటూ, కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఆ బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. దీంతో ఆ చిన్నారి ఒంటరిగా ఇంట్లో ఉంది. దీనిని గమనించిన 30 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల నవీన్ ఆ బాలికను వేరే చోటుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం పోటీ పరీక్షలు ప్రవేశపెట్టే ప్రతిపాదనేమీ లేదు - రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం

తరువాత ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలిపింది. దీంతో తండ్రి కోపంతో నిందితులను నిలదీశాడు. కానీ నిందితులే అతడిపై తిరగబడి దాడి చేశారని పోలీసుల ఎదుట ఆరోపించారు. ఈ ఘటనను ఎవరికీ చెప్పకూడదని, ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన భయంతో ఈ ఘటనను ఎవరికీ చెప్పలేదు. 

సీమా హైదర్ కు భారత పౌరసత్వం ఇవ్వాలి - సచిన్ మీనా తండ్రి డిమాండ్

అయితే నిందితులు మళ్లీ రెండు రోజుల కిందట బాలిక ఇంటికి చేరుకున్నారు. ఇంకో సారి కూడా ఆమెను బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆ దుండగుల నుంచి తన బిడ్డకు రక్షణ కల్పించాలని తండ్రి తన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios