తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE)  TG EAPCET 2025 ఫలితాలను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇంజ‌నీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఇంతకీ ఈ ఫలితాల్లో టాప‌ర్స్‌గా నిలిచిన వారు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.   

తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి ఆదివారం  TG EAPCET 2025 ఫలితాలను విడుద‌ల చేసింది. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 2 నుండి 4 వరకు జరిగాయి.

ఇంజినీరింగ్‌ విభాగంలో టాపర్లు:

* పల్లా భారత్ చంద్ర – 150.058429

* ఉడగండ్ల రామచరణ్ రెడ్డి – 148.284029

* పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ – 147.085966

* లక్ష్మీ భర్గవ్ మెండే – 146.150845

* మంత్రిరెడ్డి వెంకట గణేష్ రాయల్ – 144.053382

* సుంకర సాయి రిషాంత్ రెడ్డి – 143.723785

* రుష్మిత్ బండారి – 142.579622

* బణి బ్రత మాజీ – 141.084897

* కోఠ ధనుష్ రెడ్డి – 140.24602

* కొమ్మ శ్రీ కార్తిక్ – 138.257604

అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగం టాపర్లు:

* పెద్దక్కగారి సాకేత్ రెడ్డి – 141.688297

* సబ్బని లలిత్ వరేణ్య – 140.477712

* చాడ అక్షిత్ – 140.00081

* పెద్దింటి రాచల షైనంద్ – 138.823946

* బ్రహ్మణి రెండ్లా – 138.710191

* గుమ్మడిదల తేజస్ – 137.82964

* కోలన్ అఖిరానంద్ రెడ్డి – 137.635667

* భానుప్రకాశ్ రెడ్డి సాధు – 136.702087

* అర్జా స్యామువెల్ సాత్విక్ – 136.674587

* శేషి కిరణ్ రెడ్డి – 136.494315

TG EAPCET 2025 ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

* ముందుగా TG EAPCET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

* త‌ర్వాత View Results (E, A&P)” అనే విభాగంపై క్లిక్ చేయండి

* హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్,  పుట్టిన తేదీ నమోదు చేయండి

* 'View Results' క్లిక్ చేస్తే ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు