తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్‌దే అధికారమని.. నాకు 66 ఏళ్లేనని, మరో పదేళ్లు సీఎంగా చేయలేనా అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తానని.. నాకు ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు యురేనియం తవ్వకాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అంతేకాకుండా భవిష్యత్‌లో సైతం అనుమతి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని.. దీనిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని... కేంద్ర ప్రభుత్వం దిగిరాని పక్షంలో కలిసి ఉద్యమిద్దామని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడుతున్నాం: కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు