హైదరాబాద్: అప్పులు తెచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం  తెచ్చిన అప్పును రెండు పంటల్లో తీర్చవచ్చన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు బడ్జెట్‌పై  అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.ఆర్ధిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ఉందన్నారు కేసీఆర్.ఆర్ధిక నిపుణులను సంప్రదించిన తర్వాతే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టుగా ఆయన చెప్పారు. 

తాను  కథలు చెప్పడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్దిని సాధించిందని కేంద్రం కూడ ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్ధికాభివృద్దిని సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

రుణాల విషయంలో  జపాన్, అమెరికా, చైనా బాటలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కానీ,కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇంకా 1940 నాటి కాలంలోనే ఉండాలని కోరుకొంటున్నారని ఆయన సెటైర్లు వేశారు.అత్యధిక అప్పులు ఉన్న జపాన్ ప్రపంచాన్ని శాసిస్తోందని  ఆయన  చెప్పారు. అప్పులు తెచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించినట్టుగా ఆయన స్ష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు తల తోక లేకుండా మాట్లాడినందుకు తనకు కోపం వచ్చి కొంచెం పరుష పదజాలంతో మాట్లాడినట్టుగా కేసీఆర్ చెప్పారు. తాను పరుష పదజాలాన్ని వాడినందుకు తాను కూడ బాధపడినల్టుగా  ఆయన చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ద్వారా సమృద్ధిగా వర్షాలు కురిస్తే రెండు పంటలకు నీళ్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు.